Sep 19 2021 @ 10:42AM

Prabhas: డై-హార్డ్ ఫ్యాన్‌కు సర్ప్రైజ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తన డై-హార్డ్ ఫ్యాన్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల ఉదార స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో హీరోయిజం చూపించడం మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ సామాజిక సేవ కోసం వారు ఎప్పుడూ ముందుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ప్రభాస్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న తన వీరాభిమాని మొహంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపారు. టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన డై-హార్డ్ ఫ్యాన్‌‌ను సెప్టెంబర్ 16న వీడియో కాల్ ద్వారా పరామర్శించి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు ప్రభాస్. 

వీడియో కాల్‌లో తన అభిమాన నటుడిని చూసిన క్యాన్సర్ పేషేంట్ చాలా సంతోషించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాన్సర్ పేషేంట్ ఆరోగ్య పరిస్థితి, ప్రభాస్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని తెలుసుకొని వరుస సినిమాలతో బిజీగా ఉండి కూడా ఆమె కోసం కొంత సమయం కేటాయించారు. ఇంతకముందు 'మిర్చి' మూవీ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు భీమవరంలో మృత్యువుతో పోరాడుతున్న తన 20 ఏళ్ల అభిమానిని ఇలాగే సర్‌ప్రైజ్ చేశారు ప్రభాస్. ఆయనను చూసిన తర్వాత అబ్బాయి 20 రోజులకు పైగా జీవించాడని అతని తండ్రి మీడియా ద్వారా తెలిపారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ k' చిత్రాలలో నటిస్తున్నారు.