Sep 17 2021 @ 08:56AM

ప్రభాస్ సన్‌రూఫ్ వానిటీ వాన్ సూపర్: దర్శకుడు ఓం రౌత్

ప్రభాస్ సన్‌రూఫ్ వానిటీ వాన్ సూపర్ అంటూ దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. వరుస పాన్ ఇండియ సినిమాలు చేస్తున్న ప్రభాస్ బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' మూవీలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ వాన్‌లో సన్‌రూఫ్ ఫీచర్‌ను ఫోటో తీసి పోస్ట్ చేస్తూ 'పనిలో ఉన్నప్పుడు కూడా ప్రకృతికి దగ్గరగా.. సూపర్' అంటూ కామెంట్ జత చేశారు. ప్రభాస్ రీసెంట్‌గా ఓ లగ్జరీ వ్యాన్ కొనుగోలు చేశారు. ఇంతకముందే కొనుగోలు చేసిన వ్యాన్‌ను అన్ని కొత్త ఫీచర్లతో పునర్నిర్మించాడు. ముఖ్యంగా ఈ వాన్‌లో సన్‌రూఫ్ ఫీచర్ అమర్చారు. ప్రభాస్ అవుట్ డోర్ లొకేషన్స్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు తన వానిటీ వ్యాన్‌లో సహజ లైటింగ్ ఉండడానికే ఇష్టపడతారట. అందుకే ఆయన ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా అమర్చుకున్నారని చెప్పుకుంటున్నారు. కాగా 'ఆదిపురుష్‌'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' చిత్ర షూటింగ్ కూడా ముంబైలోనే జరుగుతోంది. శృతి హాసన్ ఇందులో హీరోయిన్.