Jul 23 2021 @ 20:20PM

రేపే ప్రభాస్‌.. బిగ్‌బీ షూటింగ్‌ షురూ

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్న సినిమా చిత్రీకరణ శనివారం హైదరాబాద్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభం కానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర  పోషిస్తున్న సంగతి తెలిసింది. సినిమా పూజా కార్యక్రమాల కోసం శుక్రవారం బిగ్‌బీ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘కొత్త సినిమా ముహూర్తం కోసం ప్రయాణిస్తున్నా. రేపే ఫస్ట్‌ డే షూట్‌... కొత్త సినిమా.. కొత్త బిగినింగ్‌.. కొత్త వాతావరణం’’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపకా పడుకోన్‌ కథానాయిక.