May 8 2021 @ 14:04PM

లేడీ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్‌..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ఒక వైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. అయితే తాజాగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు ఓ లేడీ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ సినిమా చేస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా చేస్తున్న.. ‘రాధేశ్యామ్’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, ‘స‌లార్‌, ఆదిపురుష్’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో ఏ సినిమా షూటింగ్ పూర్త‌యినా వెంట‌నే నాగ్ అశ్విన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. ఆ వెంట‌నే మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి ప్ర‌భాస్ క‌థ‌లు వింటున్నార‌ట‌. ‘గురు, ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రాల డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర రీసెంట్‌గా ప్ర‌భాస్‌ను క‌లిసి పాయింట్‌ను నెరేట్ చేసింద‌ని, ప్ర‌భాస్‌కు క‌థాంశం న‌చ్చ‌డంతో ఫైన‌ల్ డ్రాఫ్ట్‌తో ర‌మ్మ‌ని సుధా కొంగ‌ర‌కు చెప్పార‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అలాగే మ‌హేశ్, అజిత్‌ల‌తోనూ సుధా కొంగ‌ర సినిమా చేయ‌నుంద‌నే వార్త‌లు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగ‌క త‌ప్పేలా లేదు.