Oct 20 2021 @ 10:58AM

‘హూ ఈజ్ విక్రమాదిత్య’ గా ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ గిఫ్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత ‘రాధేశ్యామ్’ గా రాబోతున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో అభిమానులకు ఐ ఫీస్ట్ ఇవ్వబోతోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సినీయర్ నటుడు కృష్ణంరాజు ఓ కీలకపాత్ర పోషించబోతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయిన నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు మేకర్స్. అందులో భాగంగా ప్రభాస్ పుట్టినరోజున ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. 



‘హూ ఈజ్ విక్రమాదిత్య’ పేరుతో రాధేశ్యామ్ లోని ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. లాస్టియర్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా ప్రేరణ పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ లుక్ తో ఓ టీజర్ విడుదల చేశారు. ఇక ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ఉదయం 11:16 నిమిషాలకు టీజర్ ను అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు మేకర్స్. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.