విలక్షణ దర్శకుడు మారుతి (Maruthi) దర్శకత్వంలో మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి బన్నీ వాస్ (Bunny Vas) నిర్మాత. ఎస్కెఎన్ సహనిర్మాతగా వ్యవహరించారు. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది.. ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలకు కారణమైంది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా.. సినిమాపై మరింత క్రేజ్ పెరగడానికి కారణమైంది. తాజాగా ఈ చిత్రానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ.. వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రభాస్, సాయిధరమ్ తేజ్‌కి ‘పక్కా కమర్షియల్’ చిత్ర దర్శకుడు మారుతి.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్’, ‘విక్రమ్’ చిత్రాలు మినహా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ విజయం దక్కలేదు. ప్రేక్షకులు కూడా థియేటర్లకు సరిగా రావడం లేదు. అందుకు కారణాలు అనేకం. కానీ జూలై 1న థియేటర్లలోకి వస్తున్న ఈ ‘పక్కా కమర్షియల్’ చిత్రం.. తిరిగి టాలీవుడ్‌కు పునర్వైభవాన్ని తీసుకువస్తుందని చిత్రయూనిట్టే కాకుండా.. సినిమా ఇండస్ట్రీ అంతా ఆశిస్తోంది. మరి ఇండస్ట్రీ అంతా వేచి చూస్తున్న విజయాన్ని ‘పక్కా కమర్షియల్’ అందిస్తుందో.. లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడక తప్పదు.