Prabhas: పూజా సెంటిమెంట్ ప్రకారం అయితే 'రాధే శ్యామ్' పెద్ద హిట్టే..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారింది మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్‌గా నిలుస్తున్నాయి. అంతేకాదు ఫ్లాపుతో ఉన్న హీరో సరసన పూజా హీరోయిన్‌గా నటిస్తే ఆ సినిమా హిట్ అందుకుంటోంది. దాంతో హీరోలకు ఇప్పుడు పూజా సక్సెస్ సెంటిమెంట్‌గా మారిందంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీని తర్వాత అల్లు అర్జున్ - పూజా జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్‌గా నిలించింది. ఇప్పటికీ బుట్టబొమ్మ పాట ట్రెండింగ్‌లో ఉంది. 

ఇక అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా మూడు సినిమాలొచ్చాయి. ఆ మూడు సినిమాలు ఫ్లాపులే. నాలుగో సినిమాగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇది అఖిల్ కెరీర్‌లో వచ్చిన మొదటి హిట్. దాంతో 'సాహో' తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్‌గా పూజా నటించింది కాబట్టి ఆ సెంట్‌మెంట్ ప్రకారం గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అంటున్నారు. ఈ సెంటిమెంట్‌ను బట్టి చూస్తే గ్యారెంటీగా ప్రభాస్‌కు 'రాధే శ్యామ్' సినిమాతో భారీ హిట్టే పడాలి. అది తెలియాలంటే 2022, జనవరి 14వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేది ఆరోజే కాబట్టి.  


Advertisement