Abn logo
Jul 6 2020 @ 09:19AM

బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ 22..?

‘బాహుబలి’తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ రేంజ్ హీరో అయ్యారు. ఆయ‌న హీరోగా నటించిన ‘సాహో’ ద‌క్షిణాది కంటే ఉత్త‌రాదినే ఎక్కువ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రెండు చిత్రాలు.. రాధాకృష్ణ ద‌ర్వ‌క‌త్వంలో చేస్తోన్న త‌న 20వ చిత్రం, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే 21వ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుద‌ల కానున్నాయి. ప్ర‌భాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ నిర్మాత‌లు కూడా ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్నార‌ట‌. తాజాగా టి సిరీస్ సంస్థ ప్ర‌భాస్‌తో ఓ సినిమాను నిర్మించాల‌నుకుంటుంద‌ని సోష‌ల్ మీడియా టాక్‌. ‘తానాజీ’ ద‌ర్శ‌కుడు ఓం రావుత్ ఈ సినిమాను తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తు‌న్నాయి. ఒక‌వేళ ఈ వార్త‌లు నిజ‌మైతే ప్ర‌భాస్ 22వ చిత్రం బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో రూపొందే అవ‌కాశాలున్నాయి.  మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement