అభిమానుల మధ్య ప్రభాకర్ చౌదరి పుట్టినరోజు వేడుకలు
ABN , First Publish Date - 2020-05-27T09:51:24+05:30 IST
అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి జన్మదిన వేడుకలు మంగళవారం అభిమానుల మధ్య ..
అనంతపురం వైద్యం, మే 26: అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి జన్మదిన వేడుకలు మంగళవారం అభిమానుల మధ్య అట్టహాసంగా కొనసాగాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూనే పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి చౌదరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్‌చేసి ఆనందం పంచుకున్నారు. చౌదరి దంపతులను భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పలువురు ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఫోన్ ద్వారా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మేయర్ స్వరూప, మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న, టౌన్‌బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళీధర్, టీడీపీ నాయకులు న్యాయవాది ఆదెన్న, సరిపూటి రమణ, నటేష్ చౌదరి, దేవళ్ల మురళి, లింగారెడ్డి, సుధాకర్ యాదవ్, విజయశ్రీ, సరళ, రాధాదేవి, జానకి, స్వప్న, శివబాల, రేణుకమ్మ, చంద్రశేఖరయ్య, న రసింహులు, నారాయణస్వామి యాదవ్, బంగినాగ, వసుంధర, సుజాతతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ప్రభాకర్‌చౌదరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వలస కార్మికులకు అన్నదానం
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జన్మదినం సందర్భంగా మంగళవారం నగరంలోని గిల్డ్‌ఆ్‌ఫసర్వీస్ పాఠశాల క్వారంటైన్‌లో ఆశ్రయం పొందుతున్న వలస కార్మికులకు తెలుగు తమ్ముళ్లు అన్నదానం చేశారు. నాయకులు సరిపూటి రమణ, నటే్‌షచౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. టీడీపీ నాయకులు నారాయణస్వామి యాదవ్, కాకర్ల ఆదినారాయణ, సుధాకర్ యాదవ్, మారుతీ గౌడ్, సరిపూటి శ్రీకాంత్, గంగవరం బుజ్జి, రజాక్, రఘు, దాదు, నాగరాజు, సురేంద్ర పాల్గొన్నారు.
వృద్ధాశ్రమంలో...
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జన్మదినం సందర్భంగా మంగళవారం బుడ్డప్పనగర్‌లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు తెలుగు మహిళలు అన్నదా నం చేశారు. నగర అధ్యక్షురాలు విజయశ్రీ, నాయకురాళ్లు జానకి, రా ధాదేవి, సరోజమ్మ, వడ్డేవాణి, క్రిష్ణవేణి, మహేశ్వరి, కంఠాదేవి, సుజాత, వసుంధర, సుమలత, శంకరమ్మ, మణెమ్మ, స్వర్ణక్క పాల్గొన్నారు.
రాయల్ నగర్‌లో...
అనంతపురం రూరల్: మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పుట్టినరోజును పురస్కరించుకుని మండలంలోని టీడీపీ నాయకులు అన్నదానం చేశారు. ఏ నారాయణపురం పంచాయతీ రాయల్‌నగర్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ప్రభాకర్ చౌదరి స్వ గృహంలో ఆయన్ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి, నాయకులు నాగరాజు, డిష్ నాగరాజు, వినోద్ పాల్గొన్నారు.
చంద్రబాబు శుభాకాంక్షలు
అనంతపురం, మే26(ఆంధ్రజ్యోతి): అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘ఈ ఏడాదంతా విజయాలు మీవెన్నంటి నడవాలని ఆకాంక్షిస్తున్నానంటూనే.. భవిష్యత్తు అంతా అదృష్టం నిండాల’ని ట్వీట్‌లో ఆశీర్వదించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేష్.. వైకంఠం ప్రభాకర్ చౌదరికి ఫోన్‌చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.