ముమ్మిడివరం పల్లిపాలెంలో ఘనంగా ప్రభలతీర్థం

ABN , First Publish Date - 2021-01-15T22:46:27+05:30 IST

ముమ్మిడివరం పల్లిపాలెంలో ప్రభలతీర్థం ఘణంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తీర్థస్థలానికి ఊరేగింపుగా 15 ప్రభలు వచ్చాయి.

ముమ్మిడివరం పల్లిపాలెంలో ఘనంగా ప్రభలతీర్థం

రాజమండ్రి: ముమ్మిడివరం పల్లిపాలెంలో ప్రభలతీర్థం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తీర్థస్థలానికి ఊరేగింపుగా 15 ప్రభలు వచ్చాయి. పీకల్లోతు రోయ్యల చెరువుల లోంచి వచ్చే ప్రభలను చూసేందుకు ప్రజలు ఆశక్తి చూపారు. కోనసీమ ప్రాంతంలో నిర్వహించే అరుదైన వేడుక ప్రభల తీర్థం. అన్ని గ్రామాల ప్రజలు అంగరంగ వైభవంగా కనుమ పండుగ రోజు ప్రభల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దాదాపు 120 గ్రామాలలో సంక్రాంతి సమయంలో ప్రభల తీర్థాలు జరుగుతాయి. దేశ, విదేశాలలో స్థిరపడిన ఎంతో మంది ప్రభల తీర్థానికి వస్తుండడం విశేషం. ఈశ్వరుని ప్రతిరూపంగా పిలిచే ప్రభలు గ్రామాలలో ఊరేగిస్తే శాంతి సౌభాగ్యాలు చేకూరతాయనేది పూర్వీకుల నమ్మకం. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత పురోభివృద్ధి సాధించినా అధునాతనమైన వాహనాలు అందుబాటులోకి వచ్చినా సంప్రదాయబద్ధంగా బండెనక బండి కట్టి రెండెడ్ల బళ్ళపైనే ప్రజలు ప్రభల తీర్థాలకు రావడం ఆనవాయితీగా వస్తోంది.

Updated Date - 2021-01-15T22:46:27+05:30 IST