వార్డు సభ్యులు బాధ్యతలు తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-26T03:22:37+05:30 IST

పంచాయతీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు తమ బాధ్యతలను తెలుసుకోవాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.శివశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

వార్డు సభ్యులు బాధ్యతలు తెలుసుకోవాలి
మాట్లాడుతున్న పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌

పీఆర్‌ డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌

దగదర్తి, అక్టోబరు 25: పంచాయతీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు తమ బాధ్యతలను  తెలుసుకోవాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.శివశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక ఎమ్పీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన 10 పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లు, ఉపసర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ పథకాలను గురించి తెలియచేసే కరదీపికలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలచేత ప్రత్యక్షంగా ఎలా ఎన్నుకోబడ్డారో వార్డు మెంబర్లు కూడా అలాగే ఎన్నుకోబడ్డారని, ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను, విధులను తెలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో ఏ. రమేష్‌, ఎమ్పీడీవో ఆర్వీ కళాధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

అల్లూరు : గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులను పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనరు శివశంకర ప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుసభ్యులు శిక్షణలో చెప్పే అంశాలపై అవగాహన కలిగి పరిపాలనలో భాగస్వాములు కావాలని తెలిపారు. అనంతరం మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షురాలు దర్శిగుంట శశిరేఖ, ఉపాధ్యక్షుడు గుమ్మడి సురేంద్రబాబు, జడ్పీటీసీ వేణమ్మ, ఎంపీడీవో నగే్‌షకుమారి, ఈవోపీఆర్డీ ఎస్‌.మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T03:22:37+05:30 IST