యువకుడిపై పోక్సో కేసు
ABN , First Publish Date - 2022-01-29T06:28:00+05:30 IST
యువకుడిపై పోక్సో కేసు
జగ్గయ్యపేట రూరల్, జనవరి 28: వివాహం చేసుకోమని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్సై శుక్రవారం తెలిపారు. మండలానికి చెందిన బాలికకు బంధువైన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన యువకుడు కొంత కాలంగా వివాహం చేసుకోమని వేధిస్తుండటంతో కుటుంబసభ్యులకు బాలిక తెలిపింది. వారు పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవటంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యుకుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.