గోరంట్లలో పది రోజులపాటు పవర్‌లూమ్స్‌ బంద్‌

ABN , First Publish Date - 2021-05-17T05:13:23+05:30 IST

కరోనా రెండో విడత తీవ్ర రూపం దాల్చడంతో చేనేత కార్మికులను దృష్టిలో ఉంచుకుని గోరంట్ల మండలంలో పదిరోజులపాటు పవర్‌లూమ్స్‌ నిలిపివేయాలని అసోసియేషన నాయకులు నిర్ణయించారు.

గోరంట్లలో పది రోజులపాటు పవర్‌లూమ్స్‌ బంద్‌
బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు

గోరంట్ల, మే 16: కరోనా రెండో విడత తీవ్ర రూపం దాల్చడంతో చేనేత కార్మికులను దృష్టిలో ఉంచుకుని గోరంట్ల మండలంలో పదిరోజులపాటు పవర్‌లూమ్స్‌ నిలిపివేయాలని అసోసియేషన నాయకులు నిర్ణయించారు. గోరంట్లలోని చౌడేశ్వరీ కాలనీలో శనివారం చేనేత కార్మికులు అంబే వెంకటేశ(58) అనంతపురం ఆసుపత్రిలో వడ్డె కుశాల వెంకటేశ(36) హిందూపురం ఆసుపత్రిలో కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో పవర్‌లూమ్స్‌ ఓనర్స్‌ అసోసియేషన ఆదివారం సమావేశమై పరిస్థితిపై సమీక్షిస్తూ అసువులు బాసిన చేనేత కార్మికులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆదుకోవడానికిగాను మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని అసోసియేషన నిర్ణయించింది. యూనియన నాయకులు చందాలు వేసుకుని అంబే వెంకటేశ కుమార్తె జ్యోతికి రూ.10వేలు, కుసాల వెంకటేశ పిల్లలు బాలాజీ, మేఘనలకు రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. పవర్‌లూమ్స్‌ కార్మికులను ఆదుకునేందుకు పది రోజులపాటు మండల వ్యాప్తంగా కరెంటు మగ్గాలను నిలిపివేయాలని యూనియన తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పవర్‌లూమ్స్‌ ఓనర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు కట్టా నారాయణ, కార్యదర్శి ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు నారాయణస్వామి, ఆంజనేయులు, సుధాకర్‌, శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T05:13:23+05:30 IST