పవర్‌ఫుల్‌ వీడియో ఎడిటర్‌

ABN , First Publish Date - 2021-04-17T06:09:42+05:30 IST

ఆండ్రాయిడ్‌లో ఫొటోల కోసం శక్తిమంతమైన వీడియో ఎడిటర్‌ను గూగుల్‌ విడుదల చేసింది. ఐఔస్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని రిలీజ్‌ చేసింది

పవర్‌ఫుల్‌ వీడియో ఎడిటర్‌

ఆండ్రాయిడ్‌లో ఫొటోల కోసం  శక్తిమంతమైన వీడియో ఎడిటర్‌ను గూగుల్‌ విడుదల చేసింది. ఐఔస్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని రిలీజ్‌ చేసింది. ఫొటోలను ట్రిమ్‌, వీడియోస్‌ రొటేషన్‌, పాత ఎడిటర్‌ ప్రకారం స్టెబిలైజేషన్‌కు ఈ సరికొత్త ఎడిటింగ్‌ టూల్స్‌ ఉపయోగ  పడతాయి. ఫ్రేమ్‌ను క్రాప్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఫ్రేమ్‌లను పంచుకోవచ్చు. పెరస్పెక్టివ్‌ను మార్చుకోవచ్చు. ఫిల్టర్స్‌ను చేర్చుకోవచ్చు. ఇవన్నీ ఎడిట్‌ సూట్‌లో భాగంగా ఉంటాయి. బ్రైట్‌నెస్‌ పెంపు, కాంట్రాస్ట్‌, స్కిన్‌ కలర్‌, షాడో, టింట్‌ సహా ముప్పయ్‌ వరకు ఎడిటింగ్‌ టూల్స్‌ ఉన్నాయి. ఏతావతా కావాల్సిన ఫలితాలను పొందే సౌలభ్యం ఈ టూల్స్‌తో ఉంది. అయినప్పటికీ అన్నీ ఉన్నాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. యాపిల్‌కు చెందిన ఐమూవీ మాదిరిగా రెండు క్లిప్‌లను కలిపే వీలు లేదు. అలాంటి వాటి కోసం ప్లేస్టోర్‌లో వెతుక్కోవాల్సిందే.  ప్రస్తుతం ఈ కొత్త వీడియో ఎడిటర్‌, సెర్వర్‌ సైడ్‌ అప్‌డేట్‌గా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో ఉంది.  

Updated Date - 2021-04-17T06:09:42+05:30 IST