కేఎ్‌సకే ఎనర్జీ లిక్విడేషన్‌కు ఆదేశాలు

ABN , First Publish Date - 2020-11-27T06:28:07+05:30 IST

విద్యుదుత్పత్తి కంపెనీ కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్‌ లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు స్పందన లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది

కేఎ్‌సకే ఎనర్జీ లిక్విడేషన్‌కు ఆదేశాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యుదుత్పత్తి కంపెనీ కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్‌ లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు స్పందన లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణ కొమరవోలును లిక్విడేటర్‌గా నియమించింది. కంపెనీ బోర్డు అధికారాలను రద్దు చేసింది. కంపెనీ లిక్విడేషన్‌కు రుణదాతల కమిటీ 78.67 శాతం ఓటింగ్‌తో ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన కేఎ్‌సకే పవర్‌ వెంచర్‌ ఎన్‌ఎ్‌సఈ, బీఎ్‌సఈలో నమోదైంది. 

Updated Date - 2020-11-27T06:28:07+05:30 IST