అమరావతి: సీఎం జగన్‌కి పవర్ ఇస్తే ప్రజలకు కరెంట్ లేకుండా చేశారని టీడీపీ నేత పట్టాభి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రివర్స్ గేర్ పాలనలో త్వరలోనే ప్రజలు లాంతర్లు పట్టుకొని తిరగడం ఖాయమన్నారు. విద్యుత్ శాఖలో ఏం జరుగుతోందో మంత్రి బాలినేనికి తెలియదని ఎద్దేవాచేశారు. బొగ్గునిల్వలు లేవని కేంద్రానికి కుంటిసాకులు చెబుతారా? అని ప్రశ్నించారు. 1993-94లో ఉమ్మడి ఏపీ విద్పుత్ ఉత్పాదన సామర్థ్యం 5,634 మెగావాట్లు.. 2019 నాటికి విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని 17 వేల మెగావాట్లకు చేర్చారని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేకపోవటానికి సీఎం కారణం కాదా? అని పట్టాభి ప్రశ్నించారు.