విద్యుత్‌ చార్జీల బాదుడుపై గరం గరం

ABN , First Publish Date - 2021-10-20T04:56:12+05:30 IST

తాను అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను పెంచనని అన్న జగన్‌.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు సార్లు కరెంటు చార్జీలు పెంచి ట్రూఅప్‌ అదనపు విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నరసాపురం టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు.

విద్యుత్‌ చార్జీల బాదుడుపై గరం గరం
దొంగపిండిలో మాట్లాడుతున్న నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి

విద్యుత్‌ చార్జీలు పెంచనన్న హామీ ఏమైంది

టీడీపీ నాయకుల ఆందోళన


భీమవరం రూరల్‌, అక్టోబరు 19 : తాను అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను పెంచనని అన్న జగన్‌..  అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు సార్లు కరెంటు చార్జీలు పెంచి ట్రూఅప్‌ అదనపు విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నరసాపురం టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని దొంగపిండిలో మంగళవారం కరెంటు చార్జీల పెంపుపై నిరసన ప్రదర్శన చేశారు.   రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్థసారఽథి మాట్లాడుతూ ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేసి ఇప్పటి వరకు వసూలు చేసిన చార్జీలను తిరిగి ప్రజలకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని అదనపు విద్యుత్‌ చార్జీలను తిరిగి ప్రజలకు చెల్లించాలని నినాదాలు చేశారు. కొత్తపూసలమర్రు, భీమవరం పట్టణంలోని మారుతీనగర్‌, 6, 7 వార్డుల్లో నిరసన కొనసాగించారు.  ఈ కార్యక్రమంలో భీమవరం మండల అధ్యక్షకార్యదర్శులు రేవు వెంకన్న, కవురు పృధ్వీశంకర్‌,  మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగిడి రామారావు, నాగిడి ముత్యాలరావు, బొడ్డు మోహన్‌, నాగిడి శ్రీనివాస్‌, మైలాబత్తుల ఐజాక్‌బాబు,  ఉప్పులూరి చంద్రశేఖర్‌, కౌరు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


బిల్లులు చూస్తే కరెంట్‌ షాక్‌..


పోడూరు : వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు చూస్తేనే షాక్‌ కొట్టే పరిస్థితికి తీసుకువచ్చారని పోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు,ఉపాద్యక్షుడు మైగాపుల శ్రీనివాసరావు  విమర్శించారు. మాజీ ఎంపీపీ దాసరి రత్నరాజు నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లా డారు. ట్రూ అప్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని డిమాం డ్‌ చేశారు. సమా వేశంలో గ్రామటీడీపీ అధ్యక్షుడు భూపతిరాజు సత్యనారాయ ణరాజు, మట్టపర్రు సర్పంచ్‌ దొమ్మేటి శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ దేవళ్ల ప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ బొక్కా నాగేశ్వరరావు, పాలవలస తులసీరావు,   బొక్కా సూర్యనారా యణ, కేతా హరివెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


అసమర్థ ప్రభుత్వం వల్లే కోతలు.. 


యలమంచిలి : అసమర్థ  వైసీపీ ప్రభుత్వం వల్లే వర్షాకాలంలో విద్యుత్‌ కోతలు విధించే పరిస్థితి వచ్చిందని టీడీపీ మండల అధ్యక్షుడు మామి డిశెట్టి పెద్దిరాజు ఆరోపించారు.స్థానిక కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తక్షణమే పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని, ఇప్పటి వరకూ వసూలు చేసిన ఛార్జీలను వాపసు చేయాలని, ట్రూ అప్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ భారం మోపనని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌ ఈ రెండున్నరేళ్లలో  రూ. 36 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నారిన సత్తి బాబు, ఉపాఽధ్య క్షుడు చిలుకూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:56:12+05:30 IST