ప్రణాళికా లోపం వల్లే విద్యుత్‌ కోతలు

ABN , First Publish Date - 2021-10-19T05:13:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా లోపం కారణంగానే విద్యుత్‌ కోతలు విధిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. చల్లవానిపేట సర్పంచ్‌ పంచిరెడ్డి రామచంద్రరావు స్వగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచడంతో పాటు విద్యుత్‌ కోతలు పెట్టి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రణాళికా లోపం వల్లే విద్యుత్‌ కోతలు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి


 మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు, అక్టోబరు 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా లోపం కారణంగానే విద్యుత్‌ కోతలు విధిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. చల్లవానిపేట సర్పంచ్‌ పంచిరెడ్డి రామచంద్రరావు స్వగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచడంతో పాటు విద్యుత్‌ కోతలు పెట్టి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో యూనిట్‌ రూ.3లకు దొరికితే ప్రస్తుతం రూ.6 నుంచి రూ.9 పెంచి వినియోగదారులపై పెనుభారం మోపిందని విమర్శించారు. విద్యుత్‌ కొనుగోళ్లలో కమీషన్లకు  కక్కుర్తిపడి రేట్లు పెంచిందన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వం ఉందా  అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అప్పులు చేసి అన్ని రంగాల్లోను రాష్ట్రాన్ని దివాలా తీయించిందని విమర్శించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు  చంద్రభూషణరావు, నాయకులు పంచిరెడ్డి రామచంద్రరావు, కింజరాపు సత్యం తదితరులు పాల్గొన్నారు.


 పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాల్సిందే..

ఎల్‌.ఎన్‌.పేట/కొత్తూరు: ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపై భారం వేసి పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాల్సిందేనని, లేకుంటే పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. సోమవారం ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల్లో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేరుతో నయవంచన చేస్తున్న ప్రభుత్వానికి రానున్న సాధారణ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు వి.ఆనందరావు,  ఎస్‌.కిశోర్‌కుమార్‌, ఎస్‌.తేజేశ్వరరావు, సాద నారాయణ, చింతాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-19T05:13:50+05:30 IST