అధికారం ఇస్తే.. అంధకారంలోకి నెట్టేశారు

ABN , First Publish Date - 2021-10-20T06:14:05+05:30 IST

జగన్‌రెడ్డికి అధికారం ఇస్తే 29 నెలలు తిరగకుండానే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

అధికారం ఇస్తే.. అంధకారంలోకి నెట్టేశారు
తుమ్మలపాలెంలో మాట్లాడుతున్న మాజీమంత్రి దేవినేని ఉమా

అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి దేవినేని ఉమా

తుమ్మలపాలెం(ఇబ్రహీంపట్నం)/ జి.కొండూరు, అక్టోబరు 19: జగన్‌రెడ్డికి అధికారం ఇస్తే 29 నెలలు తిరగకుండానే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొటికలపూడి, తుమ్మలపాలెం గ్రామ పార్టీ సర్వసభ్యసమావేశాలు మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని ఉమామాట్లాడుతూ అధికారం కోసం ఆనాడు జగన్‌మోహనరెడ్డి ఎన్ని అసత్యప్రచారాలు చేయాలో చేసి నేడు తాడేపల్లి రాజప్రసాదం దాటి బయటకు రావటం లేదన్నారు. పోలవరాన్ని పూర్తిగా పక్కన పెట్టి, మరో వైపు ఒక రాజధాని దిక్కులేకుండా పోగా మూడు రాజధానులు కడతానని చేప్పటం హాస్యాస్పదం అన్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఏడుస్తున్నారన్నారు. గంజాయి లేని గ్రామం లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. రాష్ట్ర ఖజానాలో లక్షా 31వేల కోట్లకు లెక్కలు తేలడం లేదని, అలాంటి ముఖ్యమంత్రి అధికారం అప్పజెప్పినందుకు బాధపడాలన్నారు. పక్క రాష్ట్రాల నేతలు, ప్రజలు మన రాష్ట్ర పరిస్థితిని చూసి జాలిపడుతున్నారన్నారు.  అరచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. పరిశ్రమలు రాకపోవడంతో నేటి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఈ నెలఖరుకు విద్యుత్‌ చార్టీలపై కొండపల్లిలో జరిగే భారీ నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు  విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్‌,  రెంటపల్లి శ్యాం,  సుంకర విష్ణుకుమార్‌, ధరణికోట విజయలక్ష్మి, చెల్లు గంగాధర్‌, తాటికొండ వెంకట రామకృష్ణమోహన్‌, తాటికొండ రామకృష్ణ, రంగు బుచ్చిబాబు, పాగి వెంకటేశ్వరరావు, నాయుడు సాంబశివరావు, మల్నీడి రామారావు, పల్లే శ్రీనివాసరావు, యోండ్లూరి పూర్ణచంద్రరావు, మల్నీడి మంగేశ్వరరావు రెంటపల్లి వెంకటేశ్వరరావు, అర్జా రత్తయ్య పాల్గొన్నారు.

 జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో మంగళవారం టీడీపీ మండల సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పజ్జూరు రవికుమార్‌ (వెంకయ్య), లంక రామకృష్ణ, సుకవాసి శ్రీహరి, లంక లితీష్‌, విజయలక్ష్మి, ఉయ్యూరు వెంకట నరసింహారావు, అంకెం ఇందిరా ప్రియదర్శిని, పటాపంచల నరసింహారావు, మంచినేని రాజశేఖర్‌, దొండపాటి విజయ్‌కుమార్‌, బాధినేని సీతారామరాజు, కాటూరు రవి, వెంకటేశ్వరరావు, గోళ్ల శ్రీనివాసరావు, బద్దిర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

తిరువూరు : విద్యుత్‌ చార్జిలు పెంచుతూ ప్రజలపై భారం మోపడంతో పాటుగా, విద్యుత్‌ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి ప్రభుత్వం నెడుతోందని  నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ విమర్శించారు.పట్టణంలోని 16, 17 వార్డుల్లో విద్యుత్‌ చారీల పెంపు, కరెంట్‌ కోతలకు వ్యతిరేకంగా మంగళవారం కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు.  దేవదత్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డి సీఎం అయిన తరువాత  ఆరు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు ఆందోళన చెందుతుంటే, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు  మరింత కుంగదిస్తుందన్నారు. 



Updated Date - 2021-10-20T06:14:05+05:30 IST