ఏపీలో వేసవికి ముందే కరెంట్ కోతలు

ABN , First Publish Date - 2022-02-25T18:22:02+05:30 IST

అమరావతి: ఏపీలో కరెంట్ కోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఏపీలో వేసవికి ముందే కరెంట్ కోతలు

అమరావతి: ఏపీలో కరెంట్ కోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వేసవికి ముందే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. అసలు రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవన్న ఉన్నతాధికారుల మాటలు ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో అబద్దాలని తేలాయి. కరెంట్ కోతలతో అన్నదాతలు, కుటీర పరిశ్రమల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.


కరెంట్ కోతలు లేవులేవంటూనే గ్రామాల్లో గంటలకొద్దీ అనధికార కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. విద్యుత్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. చేతికొచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి.

Updated Date - 2022-02-25T18:22:02+05:30 IST