స్తంభాలు నేలకొరిగి.. విద్యుత్తు ఆగి

ABN , First Publish Date - 2020-11-28T07:47:20+05:30 IST

‘నివర్‌’ ప్రభా వంతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతి న్నాయి

స్తంభాలు నేలకొరిగి.. విద్యుత్తు ఆగి

అంధకారంలో పలు గ్రామాలు

ప్రత్యామ్నాయ పద్ధతిలో సరఫరా ఇచ్చామన్న ఎస్‌ఈ 


తిరుపతి (ఆటోనగర్‌), నవంబరు 27: ‘నివర్‌’ ప్రభా వంతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతి న్నాయి. స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, కొమ్మలుపడి వైర్లు తెగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సదరన్‌ డిస్కం అధికా రులు శుక్రవారం సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.  121 సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్తు సరఫరా చేయడానికి సిద్ధం చేసినట్లు ఎస్‌ఈ డీవీ చలపతి తెలిపారు. పాలసముద్రం సబ్‌స్టేషన్‌ ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా సరఫరా చేశామన్నారు. 33 కేవీ విద్యుత్తు స్తంభాలు 75, 11 కేవీ స్తంభాలు 930 నేలకొరగా.. 300 స్తంభాలు నాటి సరఫరా ఇచ్చామన్నారు. 298 ట్రాన్స్‌ఫార్మర్లు విఫలంకాగా.. 143 కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. 25 మండలాల్లో 1852 గ్రామాలకుగాను 1639 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని వివరించారు. మిగిలిన గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సరఫరా అందిస్తున్నామన్నారు. అధిక శాతం ప్రత్యామ్నాయ పద్ధతిలో విద్యుత్తు సరఫరా చేయడంలో సఫలీకృతమయ్యామన్నారు. తిరుపతి డివిజన్‌లో వంద శాతం సరఫరా ఇచ్చామని ఈఈ ఎం.కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-11-28T07:47:20+05:30 IST