దుమ్మురేపిన వార్నర్, పావెల్.. SRH ఎదుట కొండంత లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-06T03:03:54+05:30 IST
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో Delhi Capitals వీరవిహారం చేసింది.
ముంబై: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో Delhi Capitals వీరవిహారం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఓపెనర్ David Warner, రోవ్‌మన్ పావెల్ వీర విజృంభణతో ఢిల్లీ స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92, రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
మన్దీప్ సింగ్ డకౌట్ కాగా, Mitchell Marsh 10, కెప్టెన్ రిషభ్ పంత్ 26 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భవనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.