అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉంది: కేసీఆర్

ABN , First Publish Date - 2021-10-08T21:28:24+05:30 IST

అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి

అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉంది: కేసీఆర్

హైదరాబాద్: అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏం చేసింది? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఈ మధ్య చీప్ విషయాలు వింటున్నామని విమర్శించారు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టామని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోనే ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు పెద్ద బాధ్యత అప్పగించారని, అభివృద్ధి, సంక్షేమం అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 


‘‘కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి రాలేదు. కేంద్రం ఎన్నో అప్పులు చేస్తోంది. కేంద్రం మాకు ఇచ్చేది ఏం లేదు. మేమే కేంద్రానికి ఇస్తున్నాం. కేంద్రానికి అధిక ట్యాక్స్ చెల్లించే 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాజకీయంగా ఎదగాలనుకుంటే అనేక మార్గాలున్నాయి. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి అబసుపాలు కావొద్దు. కేంద్రం అనే మాట ఎత్తి నవ్వుల పాలు కాకండి.. అది రాజకీయంగా మీకే నష్టం’’ అని కేసీఆర్ అన్నారు.

Updated Date - 2021-10-08T21:28:24+05:30 IST