హరహర మహాదేవ

ABN , First Publish Date - 2020-11-30T05:52:07+05:30 IST

జిల్లాలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.

హరహర మహాదేవ

శివాలయాల్లో కార్తీక పూజలు

ఆచంటలో అఖండ జ్యోతి


ఏలూరు/ఆచంట, నవంబరు 29: జిల్లాలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయాల వద్ద  జ్వాలా తోరణం వెలిగించారు.


ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం కర్పూర జ్యోతి (అఖండ జ్యోతి) ప్రజ్వలన కనులపండువగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం కర్పూర జ్యోతిని వెలిగించారు. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఆచంటేశ్వర క్షేత్రంలో కర్పూర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, దక్షిణ భారతదేశంలో ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో మాత్రమే కర్పూర జ్యోతిని వెలిగించడం విశేషం. అఖండ జ్యోతి మహాశివరాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది.

Updated Date - 2020-11-30T05:52:07+05:30 IST