పౌండ్‌ కేక్‌

ABN , First Publish Date - 2021-12-25T19:34:36+05:30 IST

మైదా పిండి - రెండు కప్పులు, వెన్న - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెనీలా

పౌండ్‌ కేక్‌

కావలసినవి: మైదా పిండి - రెండు కప్పులు, వెన్న - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెనీలా ఎసెన్స్‌ - రెండు  టీస్పూన్లు, ఉప్పు - పావు టీస్పూన్‌, ఒక బేకింగ్‌ టిన్‌.


తయారీ విధానం: ఒక పాత్రలో పంచదార, వెనీలా ఎసెన్స్‌, కోడిగుడ్లు, వెన్న వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో మైదా తీసుకుని అందులో బేకింగ్‌ పౌడర్‌, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న పంచదార మిశ్రమంలో వేసి అన్నీ కలిసేలా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లోకి మార్చుకోవాలి. ప్రీ హీటెడ్‌ ఓవెన్‌లో 30 నుంచి 35 నిమిషాల పాటు పెట్టాలి. అంతే.. పౌండ్‌ కేక్‌ రెడీ.

Updated Date - 2021-12-25T19:34:36+05:30 IST