పౌల్ట్రీకి రూ.22,500 కోట్ల నష్టం

ABN , First Publish Date - 2020-04-04T05:51:37+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి.. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా ఫిబ్రవరి ప్రారంభం నుంచి దేశంలోని కోళ్ల పరిశ్రమ దాదాపు రూ.22,500 కోట్ల నష్టాలను చవిచూసింది. ఫిబ్రవరి మొదటి వారంలో చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందని వ్యాపించిన వదంతుల

పౌల్ట్రీకి రూ.22,500 కోట్ల నష్టం

  • ఆదుకోమని ప్రధానికి ఏఐపీబీఏ వినతి


హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి.. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా ఫిబ్రవరి ప్రారంభం నుంచి దేశంలోని కోళ్ల పరిశ్రమ దాదాపు రూ.22,500 కోట్ల నష్టాలను చవిచూసింది. ఫిబ్రవరి మొదటి వారంలో చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందని వ్యాపించిన వదంతుల వల్ల కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఇది దాదాపు ఆరు వారాల వరకూ కొనసాగిందని ఆల్‌ ఇండియా పౌలీ్ట్ర బ్రీడర్స్‌ అసోసియేషన్‌ (ఏఐపీబీఏ) వైస్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ చిట్టూరి తెలిపారు. దీనిపై స్పష్టత లభించిన తర్వాత కొద్దిగా కోలుకున్నప్పటికీ లాక్‌డౌన్‌తో రాష్ట్రాల మధ్య చికెన్‌, గుడ్ల రవాణా నిలిచిపోయిందని ఇది పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమను ఆదుకోవడానికి కేంద్రం జోక్యం చేసుకుని రుణాల పునర్‌వ్యవస్థీకరణ వంటి చర్యలు తీసుకోవాలని అసోసియేషన్‌ కోరిందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మార్చి 30న అసోసియేషన్‌ వినతి పత్రం సమర్పించిందని తెలిపారు. సత్వరమే ఆర్థిక సాయాన్ని అందించటమే కాకుండా పరిశ్రమను ఆదుకునే ప్యాకేజీని ప్రకటించాలని కోరినట్లు సురేశ్‌ వెల్లడించారు.

Updated Date - 2020-04-04T05:51:37+05:30 IST