‘జిల్లాల పెంపు ప్రస్తుతం ఉప్పుకి, ఉపకారానికి పనికిరాని పెంపు’

ABN , First Publish Date - 2022-01-27T16:51:41+05:30 IST

ఏపీలో జిల్లాల పెంపు ప్రస్తుతం ఉప్పుకి, ఉపకారానికి పనికిరాని పెంపని బాలకోటయ్య విమర్శించారు.

‘జిల్లాల పెంపు ప్రస్తుతం ఉప్పుకి, ఉపకారానికి పనికిరాని పెంపు’

అమరావతి: ఏపీలో జిల్లాల పెంపు ప్రస్తుతం ఉప్పుకి, ఉపకారానికి పనికిరాని పెంపని బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, ఉద్యమాల స్ఫూర్తిని పక్కదారి పట్టించేందుకే జిల్లాల  పెంపు ఎత్తుగడని విమర్శించారు. కర్నూలుకు దామోదరం సంజీవయ్య జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజధాని  ప్రాంత జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని, దళిత సంఘాలు ప్రభుత్వం కళ్ళు తెరిచేలా వత్తిడి తేవాలని పోతుల బాలకోటయ్య పిలుపు ఇచ్చారు.

Updated Date - 2022-01-27T16:51:41+05:30 IST