కుండపోత

ABN , First Publish Date - 2022-05-17T06:23:12+05:30 IST

చాగలమర్రి మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది.

కుండపోత
మూడురాళ్లపల్లెలో పత్తిపంటలో నిలిచిన వర్షపు నీరు

 చాగలమర్రిలో రహదారులు జలమయం  

 దెబ్బతిన్న వేరుశనగ, మొక్కజొన్న 

 రైతులకు అపార నష్టం 


చాగలమర్రి, మే 16: చాగలమర్రి మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. పిడుగుల శబ్దాలతో ప్రజలు భయాందోళన చెందారు. చింతల చెరువు, మూడురాళ్లపల్లె, కేపీ తండా, నేలంపాడు, శెట్టివీడు తదితర గ్రామాల్లో  వేరుశనగ, మొక్కజొన్న, నువ్వు, కొర్ర పంటలు దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లింది. చింతలచెరువు, చిన్నవంగలి, మూడురాళ్లపల్లె గ్రామాల్లో 200 ఎకరాల దాకా వేరుశనగ దెబ్బతిన్నది. పొలాల్లో ఆరబెట్టిన వేరుశనగ కాయలు తడిసిపోయాయని రైతులు బాలసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, పాములేటి ఆవేదన వ్యక్తం చేశారు. పంటసాగుకు చేసిన ఖర్చు వానపాలైందని   వాపోయారు. పెద్దబోదనం, రాంపల్లె, చక్రవర్తులపల్లె గ్రామ సమీపంలో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. అధికారులు నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాని  రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-17T06:23:12+05:30 IST