పోటెత్తిన కృష్ణమ్మ

ABN , First Publish Date - 2020-09-20T09:14:38+05:30 IST

వరుస వర్షాలతో కృష్టమ్మ మళ్లీ పోటెత్తింది...

పోటెత్తిన కృష్ణమ్మ

నాగార్జునసాగర్‌, చింతలపాలెం, దామర చర్ల, సెప్టెంబరు 19: వరుస వర్షాలతో కృష్టమ్మ మళ్లీ పోటెత్తింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 4,60,798 క్యూసెక్కుల వరద వస్తుండగా, ప్రాజెక్టు 20 గేట్లను పది అడుగుల మేరఎత్తి 3,40,344 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0405 టీ ఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80 అడుగులు గా (311.4474 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 2182, ఎస్‌ఎల్‌ బీసీకి 1800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 24888, 20క్రస్ట్‌ గేట్ల నుంచి 3,40,3444, మొత్తం 3,77,798 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ 20 గేట్లు ఎత్తడంతో అందాలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. డ్యాం వద్ద పోలీసులు 144సెక్షన్‌ విధించగా, పర్యాటకులు డ్యాంకు కిలోమీటర్‌ దూరంలో ఉన్న కొత్త వంతెనపై నుంచి సాగర్‌ అందాలను తిలకించారు. కాగా, సాగర్‌ ఎడమ కాల్వకు వారబంధీలో భాగంగా రెండో విడత నీటి ని శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. తొలి విడత 33 రోజులు కొనసాగగా, ఈ నెల 9వ నీటి విడుదలను నిలిపివేశారు. రెండో విడతలో భాగంగా శనివారం నీటి విడుదలను ప్రారంభించా రు. ఇది తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుందని అఽధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77 టీఎంసీలు) కాగా, ప్రస్తుత్తం 174.01 అడుగులకు (44.23టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి 2,19,040క్యూసెక్యుల నీరు వస్తుండగా, 3,04,596క్యూసెక్యులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్లను మూడు మీటర్ల ఎత్తారు. కాగా, ప్రాజెక్టు సందర్శనానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సాగర్‌ నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల వర ద వస్తుండటంతో అడవిదేవులపల్లి టెయిల్‌పాండ్‌ 18 గేట్లు ఎత్తి పులిచింతలకు అంతేమొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు.


శాంతించిన దుందుభి ప్రవాహం 

డిండి, చందంపేట : దుందుభి నది శాంతించడంతో డిండి రిజర్వాయర్‌కు వరద ప్రవాహం తగ్గింది. డిండి గరిష్ఠ నీటిమట్టానికి చేరగా, శనివారం 1270 క్యూసెక్కుల ఇన్‌ప్లో వచ్చింది. అదేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డిండి రిజర్వాయర్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. చందంపేట మండలం తెల్‌దేవరపల్లి సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్‌కు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో బొల్లారం, దేవరచర్ల, యలమలమంద గ్రామాల శివారులో ఉన్న డిండి వాగు నుంచి నాగార్జునసాగర్‌కు బ్యాక్‌ వాటర్‌ చేరుతోంది. 


మూసీ మూడు గేట్ల ఎత్తివేత

కేతేపల్లి, శాలిగౌరారం: మూసీ ప్రాజెక్టుకు శనివారం ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగుల గరిష్ఠస్థాయికి చేరువలో ఉండగా, శనివారం మూడు క్రస్టుగేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 7,1800క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 6,935క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నా రు. ప్రాజెక్టు నీటిమట్టం 644.10అడుగులుగా ఉంది. కాగా, శాలిగౌరారం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 21 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-09-20T09:14:38+05:30 IST