ఆన్‌లైన్ పేమెంట్ కోసం నెంబర్ ఇచ్చాడు.. ఆమె ఫోన్ చేసి పిలిస్తే హోటల్‌కు వెళ్లాడు.. తీరా అక్కడకు వెళ్లాక..

ABN , First Publish Date - 2022-04-07T16:55:10+05:30 IST

అతనిది హోల్‌సేల్ వ్యాపారం.. ఉల్లిపాయలను టోకుగా సరఫరా చేస్తుంటాడు..

ఆన్‌లైన్ పేమెంట్ కోసం నెంబర్ ఇచ్చాడు.. ఆమె ఫోన్ చేసి పిలిస్తే హోటల్‌కు వెళ్లాడు.. తీరా అక్కడకు వెళ్లాక..

అతనిది హోల్‌సేల్ వ్యాపారం.. ఉల్లిపాయలను టోకుగా సరఫరా చేస్తుంటాడు.. ఇటీవల అతని దుకాణానికి ఓ మహిళ వచ్చింది.. ఉల్లిపాయలు తీసుకుని ఆన్‌లైన్ పేమెంట్ చేసింది.. అనంతరం అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి మాటలు కలిపింది.. అతడిని ముగ్గులోకి దించి హోటల్‌కు రమ్మని పిలిచింది.. హోటల్ గదిలో శృంగారం సాగించింది.. ఆ ఘటనను రహస్యంగా వీడియో తీయించింది.. ఆ వీడియోతో బెదిరించి ఏకంగా రూ.7 లక్షలు కాజేసింది. 


రాజస్థాన్‌లోని బన్స్‌వారాకు చెందిన వ్యాపారవేత్త మొహ్సిన్‌ దుకాణానికి గత నెల 9వ తేదీన మీనల్ అనే మహిళ వెళ్లింది. ఉల్లిపాయలు కొనుగోలు చేసి మొహ్సిన్ ఫోన్ నెంబర్‌కు డబ్బులు పంపించింది. అదే రోజు సాయంత్రం మొహ్సిన్ నెంబర్‌కు ఫోన్ చేసి మాటలు కలిపింది. వారం రోజుల పాటు అతనితో మాట్లాడి ముగ్గులోకి దించింది. ఉన్నట్టుండి ఒకరోజు హోటల్‌లో కలుద్దామని అడిగింది. మీనల్ ఆహ్వానం మేరకు హోటల్ గదికి వెళ్లిన మొహ్సిన్ అక్కడ ఆమెతో శృంగారం సాగించాడు. ఆ ఘటన మొత్తాన్ని మీనల్ సోదరుడు వీడియో తీశాడు. 


ఆ వీడియోతో మొహ్సిన్‌ను మీనల్ బెదిరించడం ప్రారంభించింది. తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, అత్యాచార కేసు పెడతానని బెదిరించింది. దీంతో బెదిరిపోయిన మొహ్సిన్ మార్చి 15న రూ.2 లక్షలు, మార్చి 26న రూ.5 లక్షలు చెల్లించాడు. అయినా వారు ఇంకా రూ.10 లక్షలు కావాలని అడిగారు. దీంతో మొహ్సిన్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-07T16:55:10+05:30 IST