Abn logo

బంగాళదుంప యోగర్ట్‌

కావలసినవి: బంగాళదుంపలు - అరకేజీ, పెరుగు - 200ఎంఎల్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - టీస్పూన్‌, ఆవాలు - టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఉల్లిపాయలు - రెండు, పైనాపిల్‌ ముక్కలు - కొన్ని, పుదీనా - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, బ్రెడ్‌ముక్కలు - నాలుగు.


తయారీ: బంగాళదుంపలను ఉడికించాలి. తరువాత పొట్టు తీసి సన్నటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాత్రలో బంగాళదుంపల్ని వేసి, పెరుగు పోయాలి. స్టవ్‌పై పాన్‌లో నూనె పోసి కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. ఈ పోపుని బంగాళదుంపల ముక్కలపై పోయాలి. ఉల్లిపాయలు, పైనాపిక్‌ ముక్కలు వేయాలి. బ్రెడ్‌ ముక్కలు పొడిపొడిగా చేసి చల్లాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి. పుదీనాతో గార్నిష్‌ చేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా సర్వ్‌ చేయాలి.

పకోడికార్న్‌ కబాబ్‌గారెలుకార్న్‌ దోశపెసరపప్పు ఇడ్లీశొంఠి లడ్డూసెనగలు - పాలకూర సలాడ్‌కట్‌లెట్స్‌వెర్మిసెల్లీ బర్ఫీసేమ్యా దోశ
Advertisement
d_article_rhs_ad_1
Advertisement