పొటాటో బైట్స్‌

ABN , First Publish Date - 2022-03-19T19:10:52+05:30 IST

నోట్లో వేసుకుంటే చటుక్కున కరిగిపోయేలా ఉంటాయి ఈ పొటాటో బైట్స్‌. తినడం మొదలుపెడితే, ప్లేటు ఖాళీ

పొటాటో బైట్స్‌

నోట్లో వేసుకుంటే చటుక్కున కరిగిపోయేలా ఉంటాయి ఈ పొటాటో బైట్స్‌. తినడం మొదలుపెడితే, ప్లేటు ఖాళీ అయ్యేవరకూ మిమ్మల్నెవరూ ఆపలేరు. అంత రుచిగా ఉంటాయి ఈ స్నాక్స్‌. 


కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు - పావు కిలో, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, చిల్లీ ఫ్లేక్స్‌ - సరిపడా, చీజ్‌ - 100 గ్రాములు, కోడిగుడ్డు - ఒకటి, బ్రెడ్‌ పొడి -  అర కప్పు,  నూనె - వేపుడుకు సరిపడా.


తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత  పొట్టు తీసి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. కోడిగుడ్డును పగలకొట్టి గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టుకోవాలి బ్రెడ్‌ పొడిని కొద్దిగా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి చీజ్‌ను తురుముకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపల పేస్టులో ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పూరీ పిండి పరిమాణంలో బంగాళదుంప పేస్టును తీసుకుని దాంట్లో అర టీస్పూను చీజ్‌ తురుమును ఉంచి, ఉండలా చుట్టుకోవాలి. ఇలా ఉండలన్నింటినీ తయారు చేసుకోవాలి. తర్వాత వాటిని కోడిగుడ్డు సొనలో ముంచుకుంటూ, తర్వాత బ్రెడ్‌ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పొటాటో ఉండలను వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. ఈ పొటాటో బైట్స్‌ను టొమాటో సాస్‌తో వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2022-03-19T19:10:52+05:30 IST