AP ఆదర్శ పాఠశాలల్లో పోస్టులు

ABN , First Publish Date - 2022-08-08T21:40:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ(School Education Department) ప్రకటన విడుదల చేసింది.

AP ఆదర్శ పాఠశాలల్లో పోస్టులు

ఖాళీలు 282

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ(School Education Department) ప్రకటన విడుదల చేసింది. 

1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): 71 పోస్టులు

2. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): 211 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలు: టీజీటీ పోస్టులు జోన్‌ 1లో 17, జోన్‌ 3లో 23, జోన్‌ 4లో 31 ఉండగా, పీజీటీ పోస్టులు జోన్‌ 1లో 33, జోన్‌ 2లో 4, జోన్‌ 3లో 50, జోన్‌ 4లో 124.

అర్హతలు: పీజీటీ ఖాళీలకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఎంకాం అప్లయిడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎఫ్‌ అభ్యర్థులకు 49 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: జోన్‌, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. డిగ్రీ, పీజీకి 60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా చేసినవారికి 20 శాతం, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టీచింగ్‌ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17

వెబ్‌సైట్‌: https://cse.ap.gov.in/DSE/

Updated Date - 2022-08-08T21:40:21+05:30 IST