Abn logo
Sep 17 2020 @ 00:28AM

ఐపీఎల్‌తో ఆ చిత్రాల విడుదల వాయిదా

లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడడంతో సినిమాలు ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌కు ఈ సారి ఐపీఎల్‌తో కొత్త చిక్కొచ్చింది. హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసే ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువ. కలెక్షన్లు తగ్గుతాయని గతంలోనూ ఐపీఎల్‌ సీజన్‌లో థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేసేవారు. అలాగే ఇప్పుడు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉండడంతో ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే వ్యూయర్‌షిప్‌ తగ్గుతుందని భావించిన హాట్‌స్టార్‌ యాజమాన్యం బాలీవుడ్‌ చిత్రాల విడుదలను నవంబర్‌, డిసెంబర్‌కు వాయిదా వేసింది అని సమాచారం. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తోన్న ‘లక్మీబాంబ్‌’ చిత్రాన్ని నవంబర్‌లో, దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘భుజ్‌’ చిత్రం, అభిషేక్‌ బచ్చన్‌ ‘బిగ్‌ బుల్‌’ చిత్రాలు నవంబర్‌ ఆఖరుకు లేదా డిసెంబర్‌ మధ్యలో విడుదల చేస్తారని సమాచారం. అప్పుడయితే సబ్‌స్కైబర్లు, వ్యూయర్‌షిప్‌ పెరుగుతుందని భావించడమే కారణం.

Advertisement
Advertisement
Advertisement