ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా

ABN , First Publish Date - 2020-07-14T01:11:32+05:30 IST

రోనా కారణంగా ఏపీలో అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్టులు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌తో సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు.

ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా

అమరావతి: కరోనా కారణంగా ఏపీలో అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌తో సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ మూడో వారానికి ఎంసెట్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మోక్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.


ఇప్పటికే జాతీయ స్థాయిలో ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా పడ్డాయని సురేష్ గుర్తుచేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి యూజీ కోర్సులకు నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా కొత్త సిలబస్ రూపొందిస్తామని సురేష్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం 10 నెలల పాటు విద్యార్థులు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డిగ్రీ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నామని, మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ లోపు నిర్వహిస్తామని ప్రకటించారు. పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తుందని సురేష్ వెల్లడించారు. 

Updated Date - 2020-07-14T01:11:32+05:30 IST