May 6 2021 @ 00:16AM

వాయిదా వేశారు!

రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడీ’ చిత్రం విడుదల వాయిదా పడింది. ‘ప్లే స్మార్ట్‌’ అన్నది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నెల 28న చిత్రం విడుదల కావాలి. అయితే కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కరోనా ఉదృతి తగ్గిన తర్వాత మళ్లీ రిలీజ్‌  డేట్‌ ప్రకటిస్తామని చెప్పారు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాత. జయంతీలాల్‌ గడ సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.