ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2020-05-23T10:27:26+05:30 IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మరోసారి వాయి దా వేసింది. 45 రోజుల పాటు

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మళ్లీ వాయిదా

45 రోజులు పొడిగించిన ఎన్నికల కమిషన్‌ 


నిజామాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మరోసారి వాయి దా వేసింది. 45 రోజుల పాటు ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ ప్రకటించారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చి చివరి వారంలో ఎన్ని కల సంఘం వాయిదా వేసింది. దేశవ్యాప్త ఎన్నికలపైన ఇదే రీతిలో నిర్ణయాన్ని ప్రకటించింది.


దేశంలో కరోనా తగ్గకపోవడంతో మళ్లీ వాయిదా వేసి ంది. ఆగస్టు నెలలో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నిక కోసం మార్చి 12న నోటిఫికేషన్‌ను ఇచ్చారు. నామినేషన్‌లను స్వీకరించారు. మొ త్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. నలుగురు విత్‌ డ్రా చేసుకోగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు.


కోవిడ్‌-19 విజృంభించడంతో ఈ ఎన్నికను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. మొదటి షెడ్యూల్‌ ప్రకా రం ఏప్రిల్‌ 7న పోలింగ్‌, 9న కౌంటింగ్‌ జరిగేది. ప్రస్తుతం రెండోసారి వా యిదా వేయడం వల్ల ఈ ఎన్నిక మరింత ఆలస్యం కానుంది. ఉమ్మడి జిల్లా లో ప్రాతినిధ్యం వహించే ఈ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడడంతో అన్ని పార్టీల్లోనూ నిరాశ కనిపించింది. 

Updated Date - 2020-05-23T10:27:26+05:30 IST