ఓటీపీ అథెంటికేషన్‌తో పోస్ట్‌ పెయిడ్‌ టు ప్రీపెయిడ్‌

ABN , First Publish Date - 2021-05-29T08:45:18+05:30 IST

ఓటీపీ ఆధారిత అథెంటికేషన్‌తో ఇకపై ‘పోస్ట్‌ పెయిడ్‌’ నుంచి ‘ప్రీపెయిడ్‌’కు అట్నుంచి ఇటుకు మొబైల్‌ వినియోగదారులు మారవచ్చు. ఇందుకోసం ఇకపై ‘సిమ్‌’ కార్డును మార్చాల్సిన అవసరం కూడా ఉండదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌(డీఓటీ) తెలిపింది.

ఓటీపీ అథెంటికేషన్‌తో పోస్ట్‌ పెయిడ్‌ టు ప్రీపెయిడ్‌

ఓటీపీ ఆధారిత అథెంటికేషన్‌తో ఇకపై ‘పోస్ట్‌ పెయిడ్‌’ నుంచి ‘ప్రీపెయిడ్‌’కు అట్నుంచి ఇటుకు మొబైల్‌ వినియోగదారులు మారవచ్చు. ఇందుకోసం ఇకపై ‘సిమ్‌’ కార్డును మార్చాల్సిన అవసరం కూడా ఉండదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌(డీఓటీ) తెలిపింది. సెల్యులర్‌ ఆపరేటర్స్‌  అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంబంధిత మెకానిజాన్ని ప్రతిపాదించింది. ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌(పీఓసీ)ని వెంట ఉంచుకోవాలని టెలికాం ఆపరేటర్లను డిపార్ట్‌మెంట్‌ ఆదేశించింది.


పీఓసీ ఫలితాలను అనుసరించి మార్పు ఉంటుందని డీఓటీ చెబుతోంది. కేవైసీ సమర్పణ అనేది లేకుండా కేవలం ఓటీపీ అథంటికేషన్‌తో  ప్రీపెయిడ్‌ - పోస్ట్‌ పెయిడ్‌ మార్పునకు అంగీకరించాలని ‘జియో’, ‘వోడా’, ‘ఎయిర్‌టెల్‌’  తదితర సంస్థలు సభ్యులుగా ఉన్న సెల్యులర్‌ ఆపరేటర్స్‌  అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా  ప్రతిపాదించింది. ఇటీవలి కాలంలో చాలా వ్యవహారాలకు ఓటీపీ(ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) అనుకూలంగా ఉంది.  కొత్త ప్రతిపాదన ప్రకారం వెబ్‌సైట్‌ లేదంటే ఆథరైజ్డ్‌ పోర్టల్‌ సహాయంతో పదినిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉండే ఓటీపీ ఆధారంగా మార్పులు జరగాలని సూచించారు. 


ఇలాంటి సందర్భాల్లో ఒక వేళ సర్వీ్‌సకు అంతరాయం కలిగినప్పటికీ ముప్పయ్‌ నిమిషాల్లోనే సర్దుబాటుకు అవకాశం ఉంటుందని డీఓటీ చెబుతోంది. అయితే ప్రసుతం 90 శాతం మంది ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రయిబర్లే కావడం గమనార్హం.

Updated Date - 2021-05-29T08:45:18+05:30 IST