Abn logo
May 16 2021 @ 23:35PM

రోడ్డు ప్రమాదంలో పోస్టుమ్యాన్‌ మృతి

చక్రాయపేట, మే 16: మండలంలోని గంగారపుపల్లె బ్రాంచ్‌ పోస్టాఫీసులో పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్న చౌడం వెంకటరమణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.  వెంకటరమణ విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కొండప్పగారిపల్లె వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో గాయపడిన వెంకటరమణను గమనించిన స్థానికులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు తరలించే లోపు మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement