ఎక్సైజ్‌లో పైరవీ పోస్టింగ్‌లు

ABN , First Publish Date - 2021-05-07T09:42:57+05:30 IST

ఎక్సైజ్‌ శాఖలో పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగుల్లో పెద్ద ఎత్తున పైరవీలు సాగాయి. ఒక మంత్రి, ఎమ్మెల్సీ చెప్పిన వారికి ఫోకల్‌ పాయింట్లలో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు

ఎక్సైజ్‌లో పైరవీ పోస్టింగ్‌లు

మంత్రి, ఎమ్మెల్సీ చెప్పిన వారికి ఫోకల్‌ పాయింట్లు

ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం

75 మంది బదిలీ, పోస్టింగ్‌లు

81 మందికి డీపీసీ పూర్తి


హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖలో పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగుల్లో పెద్ద ఎత్తున పైరవీలు సాగాయి. ఒక మంత్రి, ఎమ్మెల్సీ చెప్పిన వారికి ఫోకల్‌ పాయింట్లలో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి, వివిధ సంఘాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న వారికి ఫోకల్‌ పాయింట్లు దక్కా యి. మిగిలిన వారికి నాన్‌-ఫోకల్‌ పాయింట్లలో పోస్టింగ్‌ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందుతున్నా రు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను జనవరిలోనే పూర్తి చేశారు. ఎక్సైజ్‌ శాఖ లో మాత్రం పదోన్నతుల డీపీసీ పూర్తి కాలేదు. మొత్తం 81 మంది అధికారులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. యారిటీ జాబితాను తయారు చేసి డీపీసీకి పంపించారు.


డీపీసీ సమావేశమై వీరి పదోన్నతులకు ఆమో దం తెలపాల్సి ఉంది. అయితే.. ఎక్సైజ్‌ శాఖను చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఇవ్వడంతో ఈ పదోన్నతులను డీపీసీ గురువారం ఆమోదించినట్లు తెలిసింది. దీంతో  74 మందికి ఆగమేఘాలపై పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. 45 మంది ఈఎ్‌సలు, 20 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, ఆరుగురు డిప్యూటీ క మిషనర్లు, ముగ్గురు జాయింట్‌ కమిషనర్లకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఎక్కువ మందికి ఓ మంత్రి, మరో ఎమ్మెల్సీ సిఫారసుల మేరకు కీలక స్థానాల్లో పోస్టింగ్‌ ఇ వ్వడం విమర్శలకు తావిస్తోంది. నిజామాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న డేవిడ్‌ రమాకాంత్‌కు ఓ ఎమ్మెల్సీ సిఫారసు మేరకు అత్యంత కీలకమైన రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.


రంగారెడ్డి అసిస్టెంట్‌ కమిషనర్‌గా చంద్రయ్యగౌడ్‌, మహబూబ్‌నగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఇన్‌చార్జి డిప్యూ టీ కమిషనర్‌గా దత్తరాజుగౌడ్‌, ఖమ్మం అసిస్టెంట్‌ కమిషనర్‌, ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌గా గణేష్‌గౌడ్‌, మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా విజయభాస్కర్‌గౌడ్‌, టీజీవో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణకు శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా, టీజీ వో అసోసియేషన్‌(ఎక్సైజ్‌) నేత రవీందర్‌రావు కు సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా, టీజీవో అసోసియేషన్‌కు చెందిన మరో నేత అరుణ్‌కుమార్‌కు మల్కాజిగిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌లు ఇచ్చినట్లు తెలిసిం ది. కీలక పోస్టింగ్‌ల కోసం ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పైరవీలు చేసినట్లు సమాచారం. 

Updated Date - 2021-05-07T09:42:57+05:30 IST