కరోనా వల్ల 10లక్షల ఉద్యోగాలు హాంఫట్

ABN , First Publish Date - 2020-09-18T19:26:51+05:30 IST

కరోనా సంక్షోభం వల్ల పంజాబ్ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.....

కరోనా వల్ల 10లక్షల ఉద్యోగాలు హాంఫట్

కారు పార్కింగ్ సహాయకులుగా పోస్టు గ్రాడ్యుయేట్లు

చండీఘడ్ (పంజాబ్): కరోనా సంక్షోభం వల్ల పంజాబ్ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి వల్ల  ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల పోస్టుగ్రాడ్యుయేట్లు సైతం చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. చండీఘడ్ నగరంలోని రాందర్బార్ ప్రాంతానికి చెందిన సరస్వతి (27) అనే యువతి నాసిక్ నగరంలోని సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమలో పనిచేసేది. కరోనా సంక్షోభం వల్ల నాసిక్ లోని సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ మూతపడటంతో సరస్వతి ఉద్యోగం కోల్పోయి తన సొంత నగరమైన చండీఘడ్ కు తిరిగివచ్చారు. అనంతరం సరస్వతి చండీఘడ్ లో కారు పార్కింగ్ అటెండెంటుగా రోజువారీ కూలీగా పనిచేస్తోంది. తనతోపాటు తన సోదరుడు అకౌంటెంటుగా పనిచేస్తూ కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయాడు. 


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ కు చెందిన రిక్షా పుల్లర్ కమల్ మిశ్రా(31) ఉపాధి కరవై చంఢీగడ్ నుంచి వెళ్లి పోయారు. మరో రిక్షా పుల్లర్ బహదూర్ శుక్లాకు గత 9 రోజుల నుంచి రూపాయి సంపాదన లేక అవస్థలు పడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పదిలక్షలమంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో వారికి ఉపాధి కల్పించేందుకు సెప్టెంబరు 24 నుంచి 30వతేదీ వరకు మెగా జాబ్ ఫెయిర్ లు నిర్వహించాలని నిర్ణయించామని సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. లక్షన్నర మంది నిరుద్యోగులు తమ పేర్లను జాబ్ ఫెయిర్ కోసం నమోదు చేసుకున్నారని సీఎం చెప్పారు. 

Updated Date - 2020-09-18T19:26:51+05:30 IST