చింతపల్లిలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు

ABN , First Publish Date - 2021-06-18T05:28:58+05:30 IST

మండల కేంద్రంలో సీపీఐ మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట ప్రధాన కేంద్రాల వద్ద పోస్టర్లను అంటించారు.

చింతపల్లిలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు
మావోయిస్టులకు వ్యతిరేకంగా అంటించిన పోస్టర్లు


చింతపల్లి, జూన్‌ 17: మండల కేంద్రంలో సీపీఐ మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట   ప్రధాన కేంద్రాల వద్ద పోస్టర్లను అంటించారు. మా గిరిజన సోదరులను మానవ కవచాలుగా వాడుకుంటున్న మావోయిస్టులు.., ఆదివాసీ సోదరులకు విజ్ఞప్తి.. పోస్టర్లను అందించారు. పాలసముద్రం అటవీ ప్రాంత ఎదురుకాల్పుల్లో గిరిజనులను మానవ కవచంగా వాడుకొని మావోయిస్టులు తప్పించుకున్నారని, పోలీసుల ఫైరింగ్‌ చేసి ఉంటే గిరిజన సోదరులు చనిపోయి ఉండేవారని పేర్కొన్నారు. గిరిజన సోదరులారా మావోయిస్టులకు సహకరించవద్దు అని పోస్టర్లలో పేర్కొన్నారు. 


 

Updated Date - 2021-06-18T05:28:58+05:30 IST