సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-08-18T06:13:56+05:30 IST

విశాఖలో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను బుధవారం పెదగంట్యాడలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

పెదగంట్యాడ ఆగస్టు 17: విశాఖలో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను బుధవారం పెదగంట్యాడలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా మహాసభలు నిర్వహించనున్నామని, స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే వుంచాలని, యువతకు ఉపాధి కల్పించాలని, తదితర అంశాలపై ప్రసంగాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో నాయకులు యెల్లేటి శ్రీనివాసరావు, పల్లేటి పోలయ్య, తాండ్ర కనకరాజు, అప్పారి విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:13:56+05:30 IST