Abn logo
Feb 19 2020 @ 23:14PM

పోస్టర్‌ ఎక్కే స్థాయికి..

పోస్టర్‌ అంటించడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి.. పోస్టర్‌ మీదకు ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడు అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘పోస్టర్‌’. సంధ్య థియేటర్‌లో ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా పదేళ్లు పని చేసిన టి.మహిపాల్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. విజయ్‌ ధరన్‌, రాశీ సింగ్‌, అక్షత సోనావానే నటీనటులు. టి.శేఖర్‌ రెడ్డి, ఏ.గంగారెడ్డి, ఐ.జి రెడ్డి. నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను డి.సురేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘టీజర్‌ చూస్తుంటే ధియేటర్‌ నేపథ్యంలో తీసిన సినిమాలా అనిపిస్తుంది. ప్రేక్షకులను థియేటర్‌కి తీసుకొచ్చే అంశాలు  కనిపిస్తున్నాయి’’ అని సురేశ్‌బాబు అన్నారు. ‘‘ప్రతి ఇంట్లో జరిగే కథనే సినిమాగా తీశా. ప్రతి చోట సమస్యలుంటాయి. వాటిని అధిగమించి ముందుకెళ్తేనే జీవితంలో ఏదన్నా సాధించగలం’ అన్నది ఇందులో కీలక అంశం. చిన్న విషయానికి కుంగిపోయి ఆత్మ హత్యలు చేసుకోవద్దు అనే సందేశం కూడా ఉంది. త్వరలో సెన్సార్‌ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్‌, స్వప్నిక తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : నివాస్‌, సంగీతం: శాండీ అద్దంకి. 

Advertisement
Advertisement
Advertisement