Abn logo
Feb 28 2021 @ 03:04AM

సప్తగిరుల దర్శనం - సర్వపాపహరణం..

  చిత్రపటాన్ని ఆవిష్కరించిన చైర్మన్‌


తిరుమల, ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు రూపొందించిన ‘సప్తగిరుల దర్శనం - సర్వపాపహరణం’ అనే చిత్రపటాన్ని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆవిష్కరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఏడు కొండలను దర్శిస్తే కలిగే ఫలాలతో రాములు చిత్రపటాన్ని తయారుచేశారు. ఈమేరకు ఆ పటాలను చైర్మన్‌తో పాటు ఈవో జవహర్‌రెడ్డి బోర్డు సభ్యులు శివకుమార్‌, దేవదాయ శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ వాణిమోహన్‌ ఆవిష్కరించారు. 

Advertisement
Advertisement
Advertisement