Abn logo
Sep 29 2021 @ 00:31AM

ఎల్‌ఐసీతో తపాలా శాఖ ‘ప్రింట్‌ టు పోస్ట్‌’ ఒప్పందం

హైదరాబాద్‌: ఎల్‌ఐసీతో తపాలా శాఖ ప్రింట్‌ టు పోస్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఎల్‌ఐసీ జారీ చేసే పాలసీ పుస్తకాలను ముద్రించి తపాలా శాఖ డిస్పాచ్‌ చేస్తుంది. ముంబైలో సోమవారం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎల్‌ఐసీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌తో పాటు మేనేజింగ్‌ డైరెక్టర్లు, పోస్టల్‌ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌  అజయ్‌ కుమార్‌ రాయ్‌, పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ టీఎం శ్రీలత, తెలం గాణ సర్కిల్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ కేఎం దేవరాజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక స్మారక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.