తపాలాశాఖ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T06:08:16+05:30 IST

తపాలాశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రూపుసీ పోస్టుమ్యాన్‌, ఎంటీఎస్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

తపాలాశాఖ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలి

సబ్‌ పోస్టాఫీసు కార్యాలయం వద్ద నిరసన

తిరువూరు, ఆగస్టు 10: తపాలాశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రూపుసీ పోస్టుమ్యాన్‌, ఎంటీఎస్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  సబ్‌పోస్టాఫీసు వద్ద నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ యూనియన్‌ పిలుపు మేరకు బుధవారం  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు పోస్టాఫీసులను ప్రైవేటీకరించడంతోపాటుగా, తపాలాశాఖ ఖాతాలన్నింటినీ ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకునకు తరలించడం దారుణమన్నారు. తపాలాశాఖపై ప్రజకు ఉన్న నమ్మకాన్ని ప్రభుత్వాల తొందరపాటు నిర్ణయాలతో వమ్ము చేస్తున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  ప్రైవేటీకరణ యోచనను ప్రభుత్వం విరమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో షేక్‌ రఫీవుద్దీన్‌, కె.రమేష్‌నాయక్‌, ఎన్‌.వెంకటరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T06:08:16+05:30 IST