సాంఘిక సంక్షేమ శాఖ సీఓఈ అడ్మిషన్లు వాయిదా

ABN , First Publish Date - 2020-04-05T21:43:24+05:30 IST

తెలంగాణ సోషల్‌ అండ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కాలేజీ(సీఓఈ)లో ఏప్రిల్‌ 8నజరగాల్సిన అడ్మిషన్లను వాయిదా వేసినట్టు

సాంఘిక సంక్షేమ శాఖ సీఓఈ అడ్మిషన్లు వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ సోషల్‌ అండ్‌ ట్రైబల్‌  వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కాలేజీ(సీఓఈ)లో ఏప్రిల్‌ 8నజరగాల్సిన అడ్మిషన్లను వాయిదా వేసినట్టు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ అండ్‌ టీటీడబ్ల్యూఆర్‌ఈఐ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి తర్వాత తేదీలను త్వరలోనే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా తె లియజేస్తామని అన్నారు. 

Updated Date - 2020-04-05T21:43:24+05:30 IST