Advertisement
Advertisement
Abn logo
Advertisement

యజమానికి తలనొప్పిగా మారిన పిల్లి.. దానికి ఎలా చెక్ పెట్టిందంటే!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని ఉద్దేశించి పెట్టిన ఓ బోర్డుపై సోషల్ మీడియాలో చర్చనడుస్తోంది. వివరాల్లోకి వెళితే...అమెరికాకు చెందిన ఒక మహిళకు తన పెంపుడు పిల్లి చేసే పనులు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంట్లోని వస్తువులు ఆమెకు తెలియకుండానే తీసుకొని వెళ్లడం మొదలు పెట్టింది. గ్లౌజులు, మాస్క్‌లను  పిల్లి నోట కరచుకొని.. పక్కింట్లో వేయడాన్ని సదరు మహిళ గమనించింది. దీంతో ఆ యజమాని ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.


తన ఇంటి వరండా భాగంలో ''నా పెంపుడు పిల్లి ఒక దొంగ'' అని బోర్డు తగిలించింది. దీంతో వస్తువులను పిల్లి దొంగతనంగా తీసుకెళ్లినా.. ఇంటి బయట ఉన్న బోర్డును గమనించి పక్కింటివాళ్లు వస్తువులను ఆమెకు తిరిగి ఇవ్వడం ప్రారంభించారు. కాగా.. సదరు యజమాని పెట్టిన బోర్డును కొందరు ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement