కరోనాను తట్టుకునేందుకు మరో ఆర్థిక ప్యాకేజీ?

ABN , First Publish Date - 2020-04-06T03:38:56+05:30 IST

భారత్‌లో లాక్ డౌన్ ఎత్తివేయాల్సి పరిస్థితి వస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై భారత ప్రభుత్వం వివిధ రకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనాను తట్టుకునేందుకు మరో ఆర్థిక ప్యాకేజీ?

న్యూఢిల్లీ: భారత్‌లో లాక్ డౌన్ ఎత్తివేయాల్సిన పరిస్థితి వస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై భారత ప్రభుత్వం వివిధ రకాల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా దెబ్బకు దిగాజారిన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు మరో ఆర్థిక ప్యాకేజీ అవసరమవుతుందా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశాలు ప్రస్తుతానికైతే తుదిరూపు సంతరించుకోలేదని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో తిరిగి డిమాండ్ ఎలా పెంచాలనే అంశం కేంద్రంగా ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-04-06T03:38:56+05:30 IST